కోటి రూపాయల జీతం వదులుకుని..!
CTR: పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లికి చెందిన రంపం శ్రీకాంత్ సివిల్స్‌లో 760వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. బీటెక్ పూర్తి చేసిన ఆయన ఏడాదికి కోటి రూపాయల జీతంతో గూగుల్లో ఉద్యోగం సాధించారు. IAS సాధించడమే లక్ష్యంగా ఆ జాబ్ వదిలేశారు. 2024లో తొలి ప్రయత్నంలో 904వ ర్యాంకు సాధించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ జాబ్ పొంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు.