మా ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయి: జెలెన్‌స్కీ
పశ్చిమాసియాలో యుద్ధంతో అమెరికా ప్రాధాన్యతలు మారుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు తమకు అమెరికా నుంచి అందిన సైనిక, ఆయుధ సరఫరాను తగ్గించి వాటిని ఇజ్రాయెల్‌కు మళ్లిస్తున్నారని తెలిపారు. దీంతో అగ్రరాజ్యం నుంచి తమకు వస్తున్న మద్దతు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. తమ ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని వాపోయారు.