ఘనంగా దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు
SRCL: బోయినపల్లి మండలం వరదవెళ్లి గ్రామ సమీపంలోని దత్తాత్రేయ స్వామి గుట్టపై శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. బుధవారం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పర్యటకశాఖ ఆధ్వర్యంలో మూడు బోట్లను అందుబాటులో ఉంచారు.