VIDEO: 'బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణలు చెప్పాలి'
SRCL: తెలంగాణ గౌరవాన్ని అవమానించి పార్లమెంటులో మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలోని పాత బస్టాండ్ వద్ద వారు శనివారం నిరసన దిగారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత తేజస్వి సూర్యకు లేదన్నారు.