తాగునీటి ఎద్దడిపై కలెక్టర్ సమీక్ష
సత్యసాయి: వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని, మరమ్మతులకు గురైన చేతి పంపులను వెంటనే బాగు చేయాలని సూచించారు.