ఆలయ నిర్మాణానికి విరాళం

ఆలయ నిర్మాణానికి విరాళం

VZM: పూసపాటిరేగ మండలం పోరాంగ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి కొవ్వాడ మాజీ సర్పంచ్, జనసేన నాయకులు కోట్ల రఘు 30 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఆలయ నిర్మాణంలో భాగంగా శుక్రవారం ఆలయ శంకుస్థాపన భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈమేరకు తన వంతు సహాయం అందించిన రఘుకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.