నేడు రాష్ట్రీయ ఏక్తా దివస్ 2K రన్: ఎస్పీ

నేడు రాష్ట్రీయ ఏక్తా దివస్ 2K రన్: ఎస్పీ

KMR: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా నేడు ఉ.9 గంటలకు 2K రన్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. డీఎస్పీ కార్యాలయం నుంచి జీవదాన్ స్కూల్ వరకు రన్ జరుగుతుందని చెప్పారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని, యువత, ప్రజలు ఐకమత్యానికి ప్రతీకగా ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.