VIDEO: దంచికొట్టిన వడగళ్ల వర్షం
ASR: అరకులోయ మండలంలో ఇవాళ మధ్యాహ్నం వాన బీభత్సం సృష్టించింది. కొత్తభల్లుగుడ, బొండం, మాడగడ, సుంకరమెట్ట పంచాయితీల పరిధిలో ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం కురిసింది. ఈ క్రమంలో పలు గ్రామాలలో వడగళ్ల వాన కురిసింది. దీంతో వడగండ్లు వరదలై పారుతున్నాయి. అయితే, ఈ అకాల వర్షంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.