అవినీతి ఫుల్.. అభివృద్ధి నిల్: జక్కంపూడి

E.G: కూటమి ప్రభుత్వం 7 నెలల పాలన అవినీతి ఫుల్.. అభివృద్ధి నిల్‌గా ఉందని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. గురువారం కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ఆయన మొక్కులో భాగంగా తలనీలాలు సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రైతాంగం పండించిన ధాన్యం ప్రతి గింజా కొంటామని హామీ ఇచ్చినా ఆచరణలో పెట్టలేదన్నారు.