'గ్యాస్ పంపిణీలో పారదర్శక సేవలు అందించాలి'
ASR: నిత్యావసర సరుకులు, గ్యాస్ పంపిణీలో పారదర్శకమైన సేవలు అందించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన గురువారం జీ.ఎల్.పురం మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్, గ్యాస్ గోదాంలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.