జూబ్లీహిల్స్‌లో డబ్బు పంపిణీ.. 10 మంది అరెస్ట్

జూబ్లీహిల్స్‌లో డబ్బు పంపిణీ.. 10 మంది అరెస్ట్

HYD: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత, పోలింగ్‌కు ముందు డబ్బుల పంపిణీ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు ఎర్రగడ్డలోని ఓ హోటల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.