ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

SRCL: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజు పల్లిలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు. గౌడ సంఘం అధ్యక్షుడు వికృతి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చునని నిరూపించిన వ్యక్తి పాపన్న అన్నారు.