VIDEO: బద్వేల్ డ్రైనేజీ కాలువల్లో పూడికతీత
KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి పూడిపోయిన డ్రైనేజీ కాలువలను కమిషనర్ నరసింహా రెడ్డి ఆదేశాల మేరకు పూడికతీత పనులను మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎక్కడైతే డ్రైనేజీ కాలువలు ఇబ్బందికరంగా మారాయో ప్రతి చోట ముమ్మరంగా పూడికతీత పనులు జేసీబీ ద్వారా జరుగుతున్నాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.