వైసీపీ సమన్వయకర్తగా పీటా నాగ మోహన్ కృష్ణ
BPT: రేపల్లె నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా పీటా నాగ మోహన్ కృష్ణను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ.. నాగ మోహన్ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.