మంత్రి కోమటిరెడ్డికి రాఖీ కట్టిన సీతక్క

NLG: సోదరీ సోదరుల మధ్య రక్షణ బంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తోంది. తోబుట్టువులకే కట్టాలనే సూత్రం ఏమీలేదు. మనసులో ఆప్యాయత, అనురాగంతో కూడిన సోదర భావం ఉంటే చాలు. ఈ నేపథ్యంలోనే శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మంత్రులు ఇద్దరూ.. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.