విషాదం.. బావిలో శవాలై తేలిన చిన్నారులు..!

విషాదం.. బావిలో శవాలై తేలిన చిన్నారులు..!

కామారెడ్డి పట్టణంలో గత తొమ్మిది రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల ఉదంతం విషాదాంతమైంది. ఈనెల 6న ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయ్(10), సింహాద్రి(9) రాజానగర్ కాలనీలోని ఓ బావిలో శవాలై కనిపించారు. 9 రోజులుగా తమ పిల్లల కోసం ఆశగా ఎదురుచూసిన తల్లిదండ్రులు, వారిని విగతజీవులుగా చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.