డోప్ పరీక్షల్లో దొరికిపోయిన ప్లేయర్లు

డోప్ పరీక్షల్లో దొరికిపోయిన ప్లేయర్లు

డోప్ పరీక్షల్లో దొరికిపోయిన హ్యామర్ త్రోయర్ మంజు బాలపై NADA ఐదేళ్ల నిషేధం విధించింది. గతేడాది నిర్వహించిన పరీక్షల్లో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. మంజు 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచింది. మరో అథ్లెట్ మోహన్ సైనీపై నాలుగేళ్ల నిషేధం విధించారు. బాక్సర్ సుమిత్‌పై రెండేళ్ల నిషేధం పడగా.. బాస్కెట్‌బాల్ ప్లేయర్ శివేంద్ర ఆరేళ్ల నిషేధానికి గురయ్యాడు.