నవీన్ చంద్ర 'పోలీస్ కంప్లైంట్'.. సాంగ్ రిలీజ్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి 'ప్రేమ ఓ ప్రేమ' అనే మెలోడి సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు సుధాకర్ మారియో అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. యాక్షన్, కామెడీ, రొమాన్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.