అనంతసాగరంలో SR రంగనాథన్ జయంతి

NLR: అనంతసాగరం శాఖ గ్రంథాలయంలో మంగళవారం గ్రంథాలయ శాస్త్ర పితామహుడు SR రంగనాథన్ 133వ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయాల స్థాపన కోసం రంగనాథన్ చేసిన కృషిని గ్రంథ పాలకుడు నారాయణరావు పాఠకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.