'నూరు శాతం వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధనకు కృషి చేయాలి'
MNCL: శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 గనిని జిఎం ఎం.శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి భూగర్భంలోని పని ప్రదేశాలను పరిశీలించి రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధనకు పలు కీలక సూచనలు చేశారు. మేనేజర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి మిగిలిన కొద్దిరోజుల్లో నూటికి నూరు శాతం వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు.