అంతిమ యాత్రలో పాల్గొని డప్పు వాయించిన మాజీ ప్రభుత్వ విప్
MNCL: మాజీ ప్రభుత్వ విప్, మాజీ MLA నల్లాల ఓదెలు మందమర్రిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి ఉద్యోగి సతీష్ అంతిమయాత్రలో ఇవాళ పాల్గొన్నారు. అంత్యక్రియలు జరుగుతుండగా.. ఓదెలు డప్పు వాయించి, పాడె మోసి మృతునిపై అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజా ప్రతినిధి స్థాయిలో ఉండి ఓ సాధారణ కార్మికుడి అంత్యక్రియల్లో ఇలా పాల్గొనడం స్థానికులను ఆకట్టుకుంది.