ఆంజనేయ స్వామి జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
NRPT: పడమటి ఆంజనేయస్వామి జాతర ఏర్పాట్లపై మంత్రి వాకిటి శ్రీహరి గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జాతర డిసెంబర్ 2న ప్రారంభం కానుందని, నవంబర్ 30న కోనేరు ప్రారంభ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, కోనేరు వద్ద స్నాన గదుల ఏర్పాట్లపై అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.