కల్తీ మద్యం సీసాలు స్వాధీనం
SKLM: సరుబుజ్జిలి మండల కేంద్రంలోని PR వైన్స్‌పై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పల్లి మురళీధర్ పర్యవేక్షణలో ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో 11 కల్తీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.