'హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపాలి'

'హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపాలి'

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపాలని కోరుతూ.. మంగళవారం రోజున బీజేపీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వారి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, హుస్నాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ తదితరులున్నారు.