'జాతీయ సమైక్యతను చాటేలా హర్ ఘర్ తిరంగా'

E,G: జాతీయ సమైక్యతను చాటేలా వాడవాడలా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు చేపట్టాలని మంత్రి సూర్యకుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం రంగంపేట మండలం వడిశలేరులో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రతను కాపాడటం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.