పెద్దతండా-కే గ్రామంలో బడిబాట
JN: పాలకుర్తి మండలం పెద్దతండా-కే గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలకుర్తి మార్కెట్ ఛైర్మన్ మంజుల- భాస్కర్ నాయక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల నమోదు పెంపు, విద్యా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఈ బడిబాట నిర్వహించినట్లు వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోని సదుపాయలను విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని కోరారు.