వైసీపీ నుంచి బీజేపీలోకి చేరిక

KRNL: ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామం నుండి వైసీపీ పార్టీకి చెందిన సుందర్ రాజు, 20 కుటుంబాలు బీజేపీలో చేరారు. బీజేపీ మండల అధ్యక్షుడు బి. ఉషారాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో ఈ చేరిక జరిగింది. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఉషారాజు తెలిపారు. ఆదోని అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.