VIDEO: ఆటో బోల్తా.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

అన్నమయ్య: సంబేపల్లి మండలంలో ఇవాళ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కలకడ నుంచి రాయచోటికి వెళ్తున్న AP 03TE 0386 నెంబర్ గల ఆటో పోలీస్ స్టేషన్ సమీపంలో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రయాణికులు సుబ్బయ్య, వెంకటస్వామి గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.