పెన్షన్‌లను అందజేసిన డిప్యూటీ స్పీకర్
W.G: ఉండి మండలంలో 'ఎన్టీఆర్ భరోసా - సామాజిక భద్రత' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి.నాగరాణి పాల్గొన్నారు.