'ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి'

'ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి'

KMM: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తల్లాడ మండలం మల్లారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు, గాంధీ చౌక్ ఈద్గాకు మరమ్మతులు, వైరా మండలం కోస్తాల సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.