గాంధీ ఆసుపత్రి నుంచి ఖైదీ పరారీ

HYD: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి నుంచి సోహైల్ అనే ఖైదీ పరారయ్యాడు. బేగంపేటలో దోపిడీ కేసులో నిందితుడైన సోహైల్‌ను వైద్య పరీక్షల కోసం చర్లపల్లి జైలు నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వాష్రూమ్ వెంటిలేటర్ నుంచి దూకి అతను పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.