ఎడ్ల బలప్రదర్శన పోటీల పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి
NDL: మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 16న రైతు సంబరాలు, అఖిల భారత స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తామని మహానంది మండల TDP రైతు కమిటీ ప్రకటించింది. ఈ పోటీల పోస్టర్‌ను నంద్యాల మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ ఛైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.