మంగళపాలెంలో పెట్రోల్ దొంగల ఆగడాలు
VSP: జీవీఎంసీ 88వ వార్డు మంగళపాలెం వైట్ బిల్డింగ్స్ పరిసరాలలో పెట్రోల్ దొంగల ఆగడాలు శృతిమించి పోతున్నాయి. ప్రతిరోజు రాత్రులు వాహనాలలో ఉన్న పెట్రోల్‌ను చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి బ్లాక్ నంబర్-38 దగ్గర పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనానికి పెట్రోల్ లాక్ ఉండడంతో డూమ్, తదితర సామాగ్రిని ధ్వంసం చేశారని వాహన యజమాని వాపోయారు.