ప్రారంభమైన రెండో విడత నామినేషన్లు

ప్రారంభమైన రెండో విడత నామినేషన్లు

మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని 16 మండలాలకు చెందిన 149 గ్రామపంచాయతీలు, 1290 వార్డుల కోసం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం మొదలైంది. నామినేషన్ సమర్పించే కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసి, సజావుగా నామినేషన్ స్వీకరణ కొనసాగిస్తున్నారు.