అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
KMR: పల్వంచ మండలం ఫరీద్‌పేటలోని అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని టీచర్‌ను హెచ్చరించారు. సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.