నిజాయితీ చాటుకున్న యువకుడు
JGL: మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడ జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు జెట్టి నరేంద్ర తన ఇంటి బయట రోడ్డుపై పడిపోయిన ఫోనును గుర్తించాడు. దానిని తీసి వెంటనే చుట్టు పక్కల వారిని ఫోను ఎవరిదని వివరాలు అడగగా.. ఎవరు తమకు తెలియదని చెప్పారు. దీంతో ఆ ఫోన్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందజేసి పోగొట్టుకున్న వారిని గుర్తించి వారికి ఫోన్ అందజేయాలని ఆయన కోరారు.