12న రామతీర్థం గంగమ్మ తిరణాళ్ల

ప్రకాశం: చీమకుర్తి మండలం రామతీర్థం శ్రీ గంగమ్మ తల్లి జాతర వార్షిక తిరుణాళ్ల ఈనెల 12వ తేదీన జరగనుంది. ముందుగా అమ్మవారికి బొల్లావుల సంబరం, కుంకుమ బండ్లు ఊరేగింపు, పొంగలు సమర్పణ నిర్వహించనున్నారు. విద్యుత్ ప్రభలు నెలకొల్పి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.