CPI బహిరంగ సభ జనవరి 18కి వాయిదా
ఖమ్మంలో డిసెంబరు 26న జరగాల్సిన సీపీఐ శతవార్షికోత్సవ బహిరంగ సభను పంచాయతీ ఎన్నికల కారణంగా జనవరి 18కు వాయిదా వేసినట్టు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.