ధర్మాన కృష్ణదాస్ ఇంటి వద్ద పోలీసుల పహారా

ధర్మాన కృష్ణదాస్ ఇంటి వద్ద పోలీసుల పహారా

SKLM: జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. మంగళవారం ఉదయం పోలాకి, జలుమూరు ఎస్సైలు జి. రంజిత్, పి. అశోక్ బాబు మబగాంలోని ఆయన గృహానికి చేరుకున్నారు. మంగళవారం చేపట్టనున్న అన్నదాత పోరుబాట కార్యక్రమంలో భాగంగా నిరసన ర్యాలీలో పాల్గొనకుండా ముందస్తుగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు.