యువతిని మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్టు

యువతిని మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్టు

AKP: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతని మోసం చేసిన కేసులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కె. రాజీవ్ గాంధీని అరెస్టు చేసినట్లు అనకాపల్లి CI ప్రేమ్ కుమార్ ఆదివారం తెలిపారు. చీడికాడ మండలానికి చెందిన కానిస్టేబుల్ చోడవరం మండలానికి చెందిన యువతిని అనకాపల్లి తన అక్క ఇంటిలో ఉంచి ఆమెను కలిసేవాడు. పెళ్లి విషయం ప్రస్తావించగా నిరాకరించడంతో కానిస్టేబుల్ అరెస్టు చేశారు.