నేలపై బైఠాయించి కౌన్సిలర్ నిరసన

నేలపై బైఠాయించి కౌన్సిలర్ నిరసన

W.G: జంగారెడ్డిగూడెం పురపాలక సమావేశంలో నాలుగో వార్డు కౌన్సిలర్ వల తాతాజీ నిరసనకు దిగారు. వార్డుకు సంబంధించిన రూ.35 లక్షల డ్రైన్ పనులను గత సభలో ఆమోదించినప్పటికీ తరువాత తిరస్కరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ సభలోనే నేలపై బైఠాయించారు. అనంతరం టేబుల్ అజెండాలో అంశాన్ని చేర్చడంతో ఇందిరానగర్ కాలనీ డ్రైన్ నిర్మాణానికి ఆమోదం లభించింది.