రవాణా శాఖలో సాంకేతిక సమస్యలు..!

రవాణా శాఖలో సాంకేతిక సమస్యలు..!

VZM: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో పలు రకాల సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. వివిధ పనుల కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి చేరుకుంటున్న వాహనదారులు సర్వర్ డౌన్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్‌కి సంబంధించిన సమాచారాన్ని నోటీసు బోర్డులో పెట్టడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు.