హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
MDK: తూప్రాన్ పట్టణ పెద్ద చెరువు కట్టపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూజారి శలాక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ, సుందరకాండ, గురు చరిత్ర పారాయణంలో చేపట్టారు. భక్తులు, హనుమాన్ మాల ధారణ భక్తులు జయంతి ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు