విదేశీ మహిళలకు చేనేత చీరలు
AP: విశాఖలో CII సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు వచ్చిన విదేశీ మహిళకు CM చంద్రబాబు మంగళగిరిలో నేసిన చేనేత చీరలను బహూకరించారు. అయితే ఒక మహిళకు ఆ చీర ఇవ్వడం చూసిన మరో మహిళ తనకు కూడా చీర కావాలంటూ చంద్రబాబు దగ్గరకు వెళ్లింది. ఆమెకు కూడా CM చీరకు అందించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయటంపై CMపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.