అదుపుతప్పి దూసుకెళ్లిన కారు.. వ్యక్తికి గాయాలు

అదుపుతప్పి దూసుకెళ్లిన కారు.. వ్యక్తికి గాయాలు

MNCL: నస్పూర్ మండలంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి కారులో ఉన్న సింగాపూర్‌కు చెందిన జైపాల్ రెడ్డిని బయటకు తీసి, 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది EMT లక్ష్మయ్య, పైలట్ అరవింద్ ఘటనాస్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రి తరలించారు.