పూరీ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత

పూరీ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత

NLR: ఒడిశా నుంచి తిరుపతి వెళ్తున్న పూరీ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టుబడింది. నెల్లూరులో ఈ రైలు ఆగినప్పుడు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద 6కేజీల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు రైల్వే డీఎస్పీ మురళీధర్ చెప్పారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు కొనసాగిస్తామన్నారు.