'PM సూర్య ఘర్ సద్వినియోగం చేసుకోవాలి'
SRCL: పీఎం - సూర్యఘర్ ముఫ్ బిజిలీ యోజన సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. పీఎం-సూర్యఘర్ ముఫ్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు నిర్వహిస్తామన్నారు.