చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
KKD: యూ. కొత్తపల్లి మండలం కోమరగిరి పంచాయతీ నాగంపేటకు చెందిన మేడిశెట్టి శ్రీను (35) తాటి చెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. గురువారం సాయంత్రం కల్లు తీసేందుకు చెట్టెక్కి దిగుతుండగా నడుముకున్న తాడు ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన శ్రీనును పిఠాపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.