'గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్ల విడుదల చేయాలి'
NZB: రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అద్యక్షుడు నర్సింహులు గౌడ్ శనివారం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.5 వేల కోట్లు విడుదల చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 17న ఇందిరా పార్క్ వద్ద ధర్న చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.