కారులో చిక్కుకున్న చిన్నారి.. కాపాడిన కానిస్టేబుల్

కారులో చిక్కుకున్న చిన్నారి.. కాపాడిన కానిస్టేబుల్

NDL: మహానందిలో ఓ కారులో పాపను మరిచిపోయి తల్లిదండ్రులు దర్శనానికి వెళ్లారు. కారులో ఊపిరాడక ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ కారు అద్దం పగులగొట్టి పాపాను బయటకు తీశారు. సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం నుంచి పాప బయట పడింది. కానిస్టేబుల్‌ చొరవను హోంమంత్రి అనిత ప్రశంసించారు.